Search here for what you are looking...

దిగంబరావదూత & మద్దిలేటి స్వామి దర్శన0 DIGAMBARAAVADHUTA & MADDILETI SWAMY DARSHAN

                        ఆరోజు ఆగస్టు 23 వ తేది, నేను నా అనుదిన గాయత్రి హోమం చేస్తుండగా 'అవధూత దిగంబర స్వామి' కాల్ చేసారని నా శ్రీమతి చెప్పింది. నేను కార్యక్రమం పూర్తిచేసుకొని స్వామికి కాల్ చేసాను. స్వామి పూర్తిగా మౌనం ఎప్పుడు మాటలాడరు. స్వామి జస్ట్ సెల్ మీద టక్, టక్ అని కొడుతుంటారు. మనం చెప్పదలచుకున్నది చెపుతాము. అయన అనంత శక్తిమంతుడు. ఎన్నో లీలలు చూపించిన అపర దత్తాత్రేయుడు. స్వామి తో నేను చెప్పాల్సింది చెప్పక సెల్ పక్కవారికి ఇచ్చి నన్ను ఒకసారి ఆశ్రమానికి రమ్మని చెప్పారు. నేను స్వామీ నేను దసరాకు వారణాసి వెళుతున్నాను, వెళ్లి వచ్చాక వస్తాను అని చెప్పను. స్వామి అందుకు ఒప్పుకోలేదు. వెంటనే రమ్మని చెప్పారు. కారణం స్వామి ఇప్పటికే రెండు సార్లు రమ్మని కాల్ చేస్తే నేను వస్తాను స్వామి అని తీరక వెళ్ళలేదు. ఎంత అజ్ఞానులమో, స్వామి సర్వ సమర్ధుడు అని తెలిసినా, అయన స్వయంగా పిలిచినా వెళ్ళలేని అజ్ఞానిని కదా. 

                                 ఇంకా స్వామి మాట కాదనలేక స్వామి దగ్గరకు మరునాడే అనగా 24th శనివారమే నేను, మా మామయ్య గారు, అలాగే ఎప్పుడు నాకు తోడుగా ఉండే నా మేనల్లుడు INBREDDY  ముగ్గురం ఉదయం 11 గంటలకు నరసరావుపేట లో హుబ్లి పాసింజర్ ట్రైన్లో బయలు దేరాము. బేతంచెర్ల వరకు ట్రైన్లో ప్రయాణం. స్లీపెర్ క్లాసు లో కుర్చుని చుట్టూ పొలాలను చూస్తూ, ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ, 16  సంవత్సరాలుగా స్వామి పరిచయంలో ఆయనతో గడిపిన ఎన్ని సంఘటనలు చెప్పుకుంటూ ప్రయాణం సాగించాము. గిద్దలూరు దాటాక వచ్చిన నల్లమల ఫారెస్ట్ అందాలు చూస్తూ అక్కడ ఒక కొండను తొలచి ఏర్పాటు చేసిన గుహలో నుండి సుమారు 2kms ట్రైన్ వెళుతుంటే బాగా ఎంజాయ్ చేసాము. చివరకు బేతంచెర్ల సాయత్రం 5.45 కి చేరాము. అక్కడ నుండి బనగానపల్లి జస్ట్ 17kms బస్ లో వెళ్ళాము. మేము ఆశ్రమానికి బనగానపల్లి నుండి బస్ లో వస్తాము అంటే, స్వామి కాదు నేను కార్ తీసుకు వస్తాను అని ఆశ్రమం నుండి తనే డ్రైవ్ చేసుకుంటూ బనగానపల్లి వచ్చారు. స్వామిజి వచ్చేలోపు మేము ఆశ్రమానికి కావలసిన కొన్ని చిల్లర సరుకులు ప్యాక్ చేయించాము. స్వామీజీ వచ్చాక వారికి నమస్కరించుకొని కార్ ఎక్కి ఆశ్రమానికి వెళ్ళాము. 

                          వాస్తవానికి దిగంబరస్వామి ఇంతకు పూర్వం పుట్టపర్తి దగ్గరలో ఉండే వారు. వారు ఈ మధ్యనే బనగానపల్లికి 15kms లో ఉన్న క్రిష్ణగిరి అనే వూరికి దగ్గరిలో ఆశ్రమం భక్తులు కట్టించి ఇస్తే అక్కడకు చేరారు. బనగానపల్లి నుండి కాశినాయన ఆశ్రమానికి బస్ ఉంది. ఆ బస్ దిగంబరస్వామి ఆశ్రమం ముందుగానే వెళుతుంది. మేము ఆశ్రమం చేరేసరికి దాదాపు 7.30pm అయింది. వేడినీటితో స్నానములు ముగించి స్వామితో కలసి భోజనం చేసాము. స్వామితో కలసి భోజన ప్రసాదం తీసుకోవడం ఒక అద్భుత అనుభవం. వారి వాత్సల్య పూరిత మనస్సు వారు పెట్టె ప్రతి ముద్దలో కనిపిస్తుంది. భోజనం ముగించాక ఆశ్రమ నిర్మాణ కార్యక్రమాల గురించి చర్చించాము. అయితే ఇక్కడ ఒక గమ్మత్తు, స్వామి దిగంబరంగా ఉన్న మనకు అయన దిగంబరంగా ఉన్నారనే స్పృహ కుడా ఉండదు. మాములుగానే ఆయనతో మసలుతూ ఉంటాము. అలానే వారు పూర్తిగా మౌనమే అయినా మౌనం అని అనిపించదు అలవాటు అయితే. అన్ని విషయాలు సైగలతోనే చెప్పగలరు. అలాగే కార్తిక పౌర్ణమికి ప్రతి సంవత్సరం చేసినట్లు గానే 'గాయత్రీ హోమయజ్ఞం' చేద్దామని స్వామి చెప్పారు. అదికూడా '108 ' యజ్ఞ కుండములతో చేద్దామని చెప్పారు. దానికి కావలసిన ఏర్పాట్ల గురించి అడిగారు. అన్ని వివరించి చేప్పాను. తరువాత ఆయనతో వేదాంత చర్చ చేసాను. నైట్ ఒంటిగంట వరకు అనేక విషయాల గురించి చర్చించాము. తన హిమాలయ యాత్ర అనుభవాలను స్వామీజీ వివరించారు. సారీ వివరించారు అంటే మాటలతో కాదు సైగలతోనే. ఎన్నో వేదాంత రహస్యాలను వివరించి ఆశీర్వదించి నిద్ర పొమ్మన్నారు. అలా స్వామీజీ తో ఆ రోజు గడిపాము.

                    మరురోజు ఆదివారం ఉదయం స్వామితో కలిసి ధ్యానం, ప్రాణాయామ కార్యక్రమాలు చేసాము. స్వామితో ధ్యానం అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. ఇంటివద్ద ఎప్పుడో అదీ ఒక క్షణమో, రెండు క్షణలో ఉండే పరమానందం ధ్యానంలో స్వామితో కూర్చుంటే ఎంతసేపైన అలా ఉంది పోతుంది. గంటలు గంటలు అలా ఉన్నరోజులు ఎన్నో. ఆశ్రమంలో జరుగుతున్నా వర్క్ విషయాలు, మేస్త్రితో మాటలాడి సలహాలు ఇచ్చి అల్ఫారం తీసుకొని అక్కడకు 12kms లలో ఉన్న 'కాశినాయన ఆశ్రమానికి' వెళ్ళాము స్వామీజీ కారులో, అక్కడ 'గణపతి నాయన' అనే స్వామీజీ ఉన్నారు. వారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు తీసుకున్నాము. అయన మారాకకు చాలా ఆనందించారు. ఆ ఆశ్రమం చాలా పెద్దది. సుమారు 25 యకరములలో ఆశ్రమం విస్తరించి ఉంది. అక్కడ 'ఆంజనేయస్వామి', శ్రీరామ, మల్లిఖార్జున దేవాలయాలు ఉన్నాయి. అవికాక కొట్టగా దాదాపు రెండు కోట్ల రూపాయలతో 'కాశినాయన' దేవాలయం నిర్మాణం చేసారు. ఇంకా ప్రతిష్ట జరగలేదు. ఆశ్రమం చాలా బావుంటుంది. మీకు తెలుసుగా కాశి నాయన ఆశ్రమాలు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడు అన్నదానం జరుగుతూ ఉంటుంది. కొన్ని వేలమంది వచ్చినా అన్నదానములు జరుగుతూనే ఉంటాయి. ఆశ్రం చుట్టూ నాలుగు వైపులా కొండలు ఉంది కొండల మధ్యలో 200 యకరముల భూమి ఉంటుంది. ఆ భూమి అంత ఆశ్రమానిదే. చక్కగా వ్యవసాయం చేస్తున్నారు అక్కడ. అవి చూసుకొని గణపతి నాయన తో కలిసి మధ్యాహ్న భోజన ప్రసాదం తీసుకొని సాయత్రం ఐదు గంటలకు స్వామివద్ద శలవు తీసుకొని మన దిగంబస్వామి ఆశ్రమానికి వెళ్ళాము.

                 అక్కడ ఆ రోజు ఉండి మరునాడు సోమవారం  11am కి బయలు దేరి 'మద్దిలేటి నరసింహస్వామి' వద్దకు వెళ్ళాము. మన ఆశ్రమం నుండి మద్దిలేటి స్వామి దేవాలయం సుమారు 4kms లు ఉంటుంది. 3kms లు కార్ వెళ్ళింది. మిగిలిన ఒక కిలోమీటర్ నడవాలి. ఆ కొండకోనల్లో, సుందర దృశ్యాలు చూస్తూ కొండ ఏటవాలుగా ఎక్కుతూ వెళుతుంటే శ్రమే తెలియలేదు. ఆ కొండకోనల దృశ్యాలు ఫొటోస్ తీసాము. వాటిని మీకు త్వరలో అందిస్తాను. చాలా గొప్పగా ఉన్నాయి ఆ సుందర దృశ్యాలు. అవి చూసుకుంటూ నడుస్తూ ఉంటె 'పిట్టకాలు' అని ఒక మూలిక అక్కడ కనిపించింది. దానిని కొంత సేకరించాము. చివరికి 'మద్దిలేటి స్వామి' దేవాలయానికి చేరాము. అక్కడ చక్కని కోనేరు ఉండి. ఎండగా ఉండి కదా అని మేము స్నానం చెయ్యలేదు. అక్కడ స్వామి చాలా powerful అని చెపుతారు. ముఖ్యంగా పిల్లలు లేనివారికి ఈ స్వామి మహిమతో ఎంతో మందికి పిల్లలు కలిగారని ప్రసిద్ది. పిల్లలు లేని వారు స్వామికి ఒక పూల మాలవేస్తారు. వారికి పిల్లలు కలుగుతారు అంటే ఆ దండ స్వామి మేడలో నుండి జారిపోతుంది. పిల్లలు కలగారు అంటే ఆ దండ కిందకు జారాడట. మేము అక్కడ అలా పిల్లలు 10 , 15 సంవత్సరాలు కుడా పిల్లలు లేక బాధపడి ఇక్కడకు వచ్చాక స్వామి కరుణతో పిల్లలు పొంది స్వామికి మొక్కులు తీర్చుకోవటానికి వచ్చిన వారిని కలిసి వారితో మాతలాడాను. వారు ఎంతో భక్తీ పారవశ్యంతో చెప్పారు ఆ స్వామి దయతోనే మాకు ఈ బిడ్డ కలిగాడు అని ఆనందంగా ఆ బిడ్డలను గుండెలకు హత్తుకుంటుంటే మాకు చాలా ఆనందం అనిపించింది. తరువాత స్వామి దర్శనం చేసుకొని మధ్యాహ్నం భోజన ప్రసాదం అక్కడే తీసుకొని సాయత్రం ఎండ తగ్గాక తెరిగి దిగంబర స్వామి ఆశ్రమానికి వెళ్ళాము. వాస్తవానికి మద్దిలేటి స్వామి వద్దకు వెళ్లేందుకు మేము వెళ్ళింది వెనుకవైపు నుండి. అసలు దారి 'డోన్' నుండి 'బేతంచర్ల' మధ్యలో రంగాపురం అనే రైల్వే స్టేషన్ ఉండి. అక్కడ నుండి 8kms లలో మద్దిలేటి స్వామి దేవాలయం ఉండి. ఆటోలు తిరుగుతాయి. అలాగే బస్ అయినా డోన్ నుండి బేతంచెర్ల మధ్యలో ఉన్న రంగాపురం నుండి వెళ్ళవచ్చు. 

                             దిగంబర స్వామి తో ఆ రోజు కుడా గడిపి మరునాడు ఉదయం అనగా మంగళవారం బయలుదేరి నరసరావుపేట ఇంటికి చేరాము. ఆ స్వామీజీ గురించి, తెలుసుకోవాలనుకునే వారు నాకు పర్సనల్ గా  mundugaa sms chesi tadanantharam కాల్ చేసి మాటలాడ వచ్చును. నా సెల్ నెంబర్ 9985609099 .

2 comments: